తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని అన్నారు. అక్టోబర్ 10 న ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.

ఈ సర్వేలో ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన సర్క్యులర్ జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 25 వ తేదీ వరకు కొనసాగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింక్ ను, క్యూఆర్ కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఈ సర్వే గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!

  3. Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. DSP : సైకిల్ పై వెళ్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ మహేంద్ర..!

మరిన్ని వార్తలు