మిర్యాలగూడ : టెన్త్ ఫలితాలలో లిటిల్ ఫ్లవర్ ప్రభంజనం

మిర్యాలగూడ : టెన్త్ ఫలితాలలో లిటిల్ ఫ్లవర్ ప్రభంజనం

మిర్యాలగూడ, మన సాక్షి :
పదవ తరగతి ఫలితాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డు లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. నూరు శాతం ఉత్తీర్ణత తో పట్టణం లోనే ప్రథమ స్థానం పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సమావేశం లో 10 జిపిఏ సాధించిన D. సాయి హరీష, 9.8 సాధించిన P. లక్ష్మీ చక్ర అఖిల, J. సంజన రాజ్, 9.7 జిపిఏ సాధించిన A. సత్యప్రియ, 9.5 జిపిఏ సాధించిన A. ప్రతీక, V. వెన్నెల, చీదళ్ళ ఫణి కుమార్ మరియు G. సాత్విక్ లను అభినందించారు.

 

విద్యార్థులను అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజన్ మాట్లాడుతూ విస్తృత మైన ప్రణాళికతో మరియు బోధనా సిబ్బంది సహకారం తో మొదటి నుండి అవిశ్రాంతంగా శ్రమించడం వలన ఈ ఖ్యాతి దక్కినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదివి నూరు శాతం ఉత్తీర్ణత ను సాధించారని అన్నారు.

 

అభినందన సమావేశంలో ఉపాధ్యాయ బృందం వెంకట్ రెడ్డి, అబ్దుల్ ఖలిం, వినోద్ చంద్రన్, ప్రసాద్, రాంబాబు, అనిల్ కుమార్, నవీన్ కుమార్, ఎండీ. జహంగీర్, ఎండీ. అజహరుద్దీన్, రమేష్, మధు నాయర్, రవి కుమార్, ఉదయ్ కిరణ్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు, సహకారం అందించిన తల్లి దండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.