Breaking Newsతెలంగాణరాజకీయం

TG : అన్నారం బ్యారేజ్ ని కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణ..!

మేడిగడ్డ బ్యారేజ్ పై కుట్రలు చేసింది చాలదన్నట్టుగా అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెర తీశారని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు పాతర వేసి ఏకంగా బ్యారేజ్ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తొవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం అని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

TG : అన్నారం బ్యారేజ్ ని కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మేడిగడ్డ బ్యారేజ్ పై కుట్రలు చేసింది చాలదన్నట్టుగా అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెర తీశారని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు పాతర వేసి ఏకంగా బ్యారేజ్ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తొవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం అని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న నిబంధనలను బ్రేక్ చేసిన ఇసుక మాఫియా పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.

తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచక పర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి రేవంత్ రెడ్డి సర్కార్ నెడుతుందని, ఇది కచ్చితంగా కాలేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే అని ఆయన పేర్కొన్నారు.

పట్ట పగలే నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజీ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుందని, తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. కాలేశ్వరం బ్యారేజీ లకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని, అందిన కాడికి దోచుకో.. దొరికిన కాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు అని పేర్కొన్నారు. తెలంగాణలో నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉందని ట్వీట్ చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు