TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

TG : రేవంత్ సర్కార్ మహిళలకు ఉగాదికి భారీ కానుక..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఉగాది పండుగ సందర్భంగా భారీ కానుక ఇవ్వబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి.

TG : రేవంత్ సర్కార్ మహిళలకు ఉగాదికి భారీ కానుక..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఉగాది పండుగ సందర్భంగా భారీ కానుక ఇవ్వబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి. మహిళల సంక్షేమానికి అమలు చేస్తామని హామీ ఇచ్చిన హామీలను అమలు చేయనున్నారు. అందుకుగాను కసరత్తు నిర్వహిస్తున్నారు.

మహిళలకు నెలకు 2500 రూపాయలు, అదే విధంగా వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ పై కసరత్తు అనంతరం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. కాగా ఈనెల 20వ తేదీన తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు.

పెండింగ్ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా ఉన్నందున బడ్జెట్ లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు