Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Rythu Bharosa : రైతు భరోసా పై మరో గుడ్ న్యూస్.. రైతులు వెంటనే త్వరపడండి..!

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పై మరో శుభవార్త తెలియజేసింది. రైతు భరోసా యాసంగి విడత నిధుల విడుదలపై తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే.

Rythu Bharosa : రైతు భరోసా పై మరో గుడ్ న్యూస్.. రైతులు వెంటనే త్వరపడండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పై మరో శుభవార్త తెలియజేసింది. రైతు భరోసా యాసంగి విడత నిధుల విడుదలపై తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. రైతు భరోసా నిధులను మార్చి 22వ తేదీన విడుదల చేస్తామని, విడుతల వారీగా అర్హులైన రైతులందరికీ ఖాతాలలో నిధులు జమ చేస్తామని చెప్పారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 1. 50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో రైతు భరోసా పధకం ద్వారా జమ చేయనున్నారు.

మరో గుడ్ న్యూస్ :

ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయం అందని రైతులకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందిశ 2026 ఫిబ్రవరి 28 లోపు పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన రైతులంతా పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ, రైతు భరోసా అప్లికేషన్ ఫారం పూర్తి చేసి వ్యవసాయ అధికారులకు అందజేయాల్సి ఉంది.

రైతు భరోసాతో ఏడాదికి 12 వేల రూపాయలు :

కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలను రైతులకు అందిస్తుంది. రెండు విడుతలగా ఎకరానికి 6000 చొప్పున 12 వేల రూపాయలను అందజేస్తుంది. వానాకాలం సీజన్ ఎకరానికి 6000 రూపాయలను అందజేసిన ప్రభుత్వం యాసంగి సీజన్ లో ఈనెల 22వ తేదీ నుంచి జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

MOST READ 

మరిన్ని వార్తలు