Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలి.. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్..!

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మేయర్ ల చేతుల మీదుగా సోమవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 40 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

Nalgonda : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలి.. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్..!

నల్లగొండ, మన సాక్షి:

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మేయర్ ల చేతుల మీదుగా సోమవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 40 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నల్గొండకు 1152 కుట్టుమిషన్లు వచ్చాయని,మొదటి విడతన 56 మందికి 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 10,000 రూపాయల విలువ గల కుట్టు మిషన్ తో పాటు, ఎలక్ట్రికల్ మిషన్ ను మహిళలకు పంపిణీ చేస్తున్నామని ,తక్కినవి విడతలవారీగా పంపిణీ చేస్తామని తెలిపారు.

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో కుట్టు మిషన్లు కావడం జరిగిందని, ఇందిరా మహిళా శక్తి కింద 40 రోజులపాటు శిక్షణ తీసుకొని మిషన్లు పొందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి లు, కార్పొరేటర్లు మాట్లాడారు.కాగా కుట్టు మిషన్ శిక్షణ పొందిన లబ్ధిదారురాలు మాట్లాడుతూ 40 రోజులపాటు కుట్టు మిషన్ల పై శిక్షణ పొందడమే కాకుండా, తనకు కుట్టు మిషన్ ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇందుకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి , ఏఎంసీ రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మేయర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ మహిళల అభివృద్ధికి పంపిణీ చేసిన కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు