TOP STORIESBreaking Newsతెలంగాణ

TG : తెలంగాణలో ఆ ఉద్యోగుల వేతనాలు నిలిపివేసిన ప్రభుత్వం..!

తెలంగాణలో సుమారు 5000 మంది ప్రభుత్వ ఉద్యోగుల మార్చి నెల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (IFMIS) లో వివరాలను మ్యాపింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

TG : తెలంగాణలో ఆ ఉద్యోగుల వేతనాలు నిలిపివేసిన ప్రభుత్వం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో సుమారు 5000 మంది ప్రభుత్వ ఉద్యోగుల మార్చి నెల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (IFMIS) లో వివరాలను మ్యాపింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సుమారు పది నెలలుగా ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వేతనాలను నిలిపివేస్తూ చర్యలు చేపట్టింది. ఈ జాబితాలో కిందిస్థాయి ఉద్యోగులే కాకుండా అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు.

తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో, అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో పెద్ద సంఖ్యలో బోగస్ ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఏరివేత లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేసేందుకు డేటా మ్యాపింగ్ ను తప్పనిసరి చేసింది. అందుకుగాను రెగ్యులర్ ఉద్యోగాల్లో కూడా చాలామంది తమ వివరాలను నమోదు చేసుకోలేదు. ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం, ఐడి కార్డులో ఉన్న వివరాలకు ఆధార్ లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడం లాంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు మ్యాపింగ్ చేసే పనిలో పడ్డారు.

ALSO READ : TG : తెలంగాణ నూతన గవర్నర్ శుక్ల నేపథ్యం.. తెలుసుకుందాం..!

పురపాలక శాఖలో కార్మికులు పేరుతో ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, మంత్రుల, అధికారుల ఇళ్లలో పనిచేసే వారిలో ఎక్కువ మంది బోగస్ ఉన్నట్లుగా ఉద్యోగ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో పాటు ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్న ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగుల వివరాలకు సంబంధించి నివేదికను సిద్ధం చేసిన తర్వాతనే నిలిపివేసిన వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో పాటు నిధులు మళ్లించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు