Sarpanch : ఆ సర్పంచ్ అభ్యర్థి.. గుర్రంపై ఊరేగింపుతో..!

Sarpanch : ఆ సర్పంచ్ అభ్యర్థి.. గుర్రంపై ఊరేగింపుతో..!
అందోలు, మనసాక్షి :
గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సామాన్ని చూపుతున్నారు. రెండవ విడతగా జరగనున్న ఎన్నికలకు గాను నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.
మండలంలో ఆరు క్లస్టర్‌లుగా విభజించి నామినేషన్లు స్వీకరించారు. అక్సాన్‌పల్లి క్లస్టర్‌లో తాడ్మన్నూర్ పంచాయతీకి చెందిన కాంగ్రేస్ మద్దతుదారుడు పట్లోళ్ల వీరారెడ్డి(నాని) అట్టహసంగా నామినేషన్‌ను దాఖలు చేసారు. రెండు గుర్రాలు తెప్పించి ఒక గుర్రంపై వీరారెడ్డి కూర్చొని తాడ్మన్నూర్ నుంచి అక్సాన్‌పల్లి వరకు వందల సంఖ్యలో మద్దతుదారులతో వచ్చారు.
అభిమానులు గజమాల వేసి వాహనంపై ఊరేగించారు. వందల సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, యువకులు తరలిరావడంతో సాధారణ ఎన్నికలను తలపించింది. అల్మాయిపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ రవిశంకర్ వందల సంఖ్యలో తన మద్దతుదారులతో నామినేషన్‌ను జోగిపేటలోని ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేసారు.
అందోలు మండలంలో 25 పంచాయతీ స్థానాలకుగాను 19 మంది సర్పంచ్ స్థానానికి, 45 మంది వార్డు మెంబర్ల స్థానానికి నామినేషన్లు దాఖలు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
MOST READ :
-
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!
-
USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి..!
-
Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!









