Sudarshan Reddy : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియామకం.. స్వగ్రామంలో తల్లి శకుంతలమ్మ ఏమన్నారంటే..?
Sudarshan Reddy : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియామకం.. స్వగ్రామంలో తల్లి శకుంతలమ్మ ఏమన్నారంటే..?
రామసముద్రం, మనసాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డి గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి సి నారాయణ రెడ్డి కుమారుడు సుదర్శన్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించిది.
వారి బంధువులు గ్రామ స్థులు సంతోషాన్ని వ్యక్త పరిచారు. వారి కుటుంబ సభ్యులు తల్లి శకుంతలమ్మ, చెల్లెలు సుభాషిణి, బావ రవికుమార్ రెడ్డి వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారిగా ప్రకటించడంఫై చాలా సంతోషం గా ఉన్నదన్నారు. చిన్నప్పటి నుండి విద్యాబ్యాసంలో ముందుండేవారని విద్యాబ్యాసం మొత్తం చెన్నై, హైదరాబాద్ లో అభ్యశించారు.సెలవులకు గ్రామానికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు గ్రామస్థులతో బాగా కలిసి మెలసి ఉండేవారని.
చిన్నప్పుడు గ్రామంలో ఉండే పిల్లలతో కలిసి ఈతకు వెళ్ళేవారు. ఆటలు క్రికెట్, బ్యాడ్మిటన్ పిల్లలతో కలిసి ఆడేవారన్నారు.బంధువులు కుటుంబ సభ్యుల శుభ కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితు లు కావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్త పరిచారు. ఆయన మరిన్నో పదవులు పొందాలని ఆకాక్సించారు.
ALSO READ :
BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!
Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!










