Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!

Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!

మన సాక్షి , హైదరాబాద్ :

జూలై ఒకటో తేదీ నుంచి ఫోన్ పే, గూగుల్ పే, ఇతర థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ నుంచి కరెంటు బిల్లులను చెల్లించడం నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో వినియోగదారులు ఈనెల కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు విద్యుత్ బిల్లును చెల్లించే వినియోగదారులు (ఉత్తర తెలంగాణ) విద్యుత్ పంపిణీ సంస్థ ఒక శుభవార్త తెలియజేసింది.

పేమెంట్ యాప్స్ స్థానంలో కొత్తగా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇంటి వద్ద మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద క్యూఆర్ కోడ్ ఇస్తారు. దాని ద్వారా మీకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించే వెసులుబాటు ఈ సంస్థ తీసుకువచ్చింది. ముందుగా ఇళ్లల్లో మీటర్ నుంచి రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కింద క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది.

 

ALSO READGood News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

 

వినియోగదారులు క్యూఆర్ కోడ్ ను మొబైల్ తో స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇతర విధానాలలో బిల్లును చెల్లించవచ్చు ఎన్పీడీసీఎల్ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇలా క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించే విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని కార్యాలయాలలో ప్రవేశపెట్టింది.

అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దశలవారీగా అన్ని జిల్లాలలో క్యూఆర్ కోడ్ బిల్లులు రానున్నాయి. ఈ విధంగా పూర్తిస్థాయిలో అమలయితే వినియోగదారుడు కి విద్యుత్ విలువ చెల్లింపులు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇప్పటికే వినియోగదారులు విద్యుత్ సంస్థ యాప్, విద్యుత్ వెబ్ సైట్ల ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు.

 

ALSO READ : 

BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!

TGEAPSET : తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన షురూ.. ఇవి ఉన్నాయేమో సరిచూసుకోండి..!

Miryalaguda : మీకు తోడుగా నేనుంటా కానీ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వారికి డెడ్ లైన్..!

 

మరిన్ని వార్తలు