Miryalaguda : మీకు తోడుగా నేనుంటా కానీ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వారికి డెడ్ లైన్..!
Miryalaguda : మీకు తోడుగా నేనుంటా కానీ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వారికి డెడ్ లైన్..!
మిర్యాలగూడ , మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి డెడ్ లైన్ వేధించారు. శుక్రవారం శనివారం తెల్లవారుజామున ఆయన పట్టణంలో తిరిగి మున్సిపల్ కార్మికులతో సమావేశమయ్యారు.
అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలంటే మీ పారిశుధ్య కార్మికులే ప్రాధాన్య పాత్ర పోషించాలన్నారు.
ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన సెంటర్స్ ఐన బస్టాండ్, రైతు మార్కెట్, మున్సిపల్ కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, డాక్టర్స్ కాలనీ వంటి ఏరియాలలో ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు. కావున ఈ ఏరియాలలో చెత్త అనేది ఎవ్వరికీ కనిపించకుండా పరిశుభ్రంగా ఉండాలి.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త వలన దోమలు అధికమై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతిఒక్క కార్మికుడు ఒక బాధ్యత గా పనిచేయండి. మీకు ప్రతీ విషయంలో నేను తోడుగా ఉంటాను, మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కారం చేస్తాను. రాబోయే ఆగస్టు 15 తేది మన 78వ స్వాతంత్ర దినోత్సవం వరకు మిర్యాలగూడ పట్టణంలో చెత్త లేకుండా చేయాలని అన్నారు.
ALSO READ :
BREAKING : వైద్య సేవలు ఎలా ఉన్నాయి.. ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగిన జిల్లా కలెక్టర్..!
Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!









