Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంసంక్షేమం

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలియజేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారిపై ఆయన కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందని తెలిపారు.

ALSO READTS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

రైతులకు రుణమాఫీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. విద్య, రైతాంగం, వైద్య సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 26 వేల పాఠశాలలకు 11 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు.

సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు పండించిన సన్న బియాన్ని మిల్లింగ్ చేయించి… రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ఇటీవలే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు తప్పకుండా ఇస్తామని ఆదుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ :

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

Basara : చదువులలో కూలి బిడ్డ టాప్, బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక..!

మరిన్ని వార్తలు