TOP STORIESఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటిన అందాల రాణి.. మిసెస్ ఇండియా విజేత విజయలక్ష్మి..!

మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుని దేశ వ్యాప్తంగా పేరు గడించిన అందాల రాణి విజయలక్ష్మి కవ్వం సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ లో అన్నమయ్య జిల్లా లోని మొలకలచెరువు విచ్చేశారు.

మొక్కలు నాటిన అందాల రాణి.. మిసెస్ ఇండియా విజేత విజయలక్ష్మి..!

మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుని దేశ వ్యాప్తంగా పేరు గడించిన అందాల రాణి విజయలక్ష్మి కవ్వం సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ లో అన్నమయ్య జిల్లా లోని మొలకలచెరువు విచ్చేశారు. సమీప బంధువు శంకర్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు, బంధు మిత్రుల నుండి సాదర స్వాగతం లభించింది. ఆమె రాక సందర్భంగా సందడి నెలకొంది.

వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈమె సంక్రాంతి సందర్భంగా మట్టి తల్లిని హత్తుకుంది. శంకర్ రెడ్డి పొలంలో మొక్కలు నాటారు. చెట్లు అందరికీ అత్యవసరమన్నారు. నేటి మొక్కలు రేపటి చెట్లుగా ఎదిగి భవిష్యత్ తరాలకు కూడా గొప్ప వరంగా మారుతాయన్నారు. చెట్లు, పచ్చదనం లేని వ్యవసాయాన్ని ఊహించలేము.

అదే విధంగా వ్యవసాయం లేకుండా జీవితం ముందుకు సాగదు.. అనాదిగా అన్నదాతల శ్రమే సమాజానికి పునాది అన్నారు. మిసెస్ ఇండియా కిరీటం సాధించినా మట్టి మీద మమకారం తరగనిదన్నారు. మొక్కలు మౌన సందేశాన్ని ఇస్తాయన్నారు. ఆమె మాటలు, బావాలు, చూపిన మమకారం అక్కడి వారి గుండెల్ని హత్తుకున్నాయి. ఆమె రాకతో ములకలచెరువులో ఒక్కసారిగా సందడి నెలకొంది

By : SIDDALA. KODANDA RAMIREDDY, MADANAPALLE,  9703966653

MOST READ 

  1. ఏమైందమ్మా.. చినబోయావు ఎందుకని.. మనసు గెలిచిన మానవత్వం..!

  2. Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!

  3. Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

  4. Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!

మరిన్ని వార్తలు