TOP STORIESBreaking Newsజాతీయం

ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!

ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆమెకు ప్రియుడు అంటే పిచ్చి ప్రేమ.. ప్రేమలో ఉన్న ఆ ప్రియురాలు ప్రియుడిని కలిసేందుకు చేసిన ఆ పని ఆ ఊరంతా రాత్రి నిద్ర లేకుండా చేసింది. ఏంటో తెలుసుకుందాం..

ఇద్దరి యువకుల ప్రేమ వ్యవహారం మొత్తం.. రోజు రాత్రి నిద్ర లేకుండా పోయింది. ప్రేమలో పడిన యువతి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఎవరు ఊహించని పని చేసింది. ఈ ఘటన బీహార్ లోని భేతియా జిల్లాలోని నౌతాన్ గ్రామంలో చోటు చేసుకుంది.

ఆ గ్రామంలో ప్రతి రాత్రి కూడా కరెంటు పోయేది. అయితే బీహార్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండటంతో గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. దాని వెనుక ఓ ప్రేమ కథ ఉందని తెలిశాక గ్రామం అంత షాక్ అయ్యారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండటం వల్ల కరెంటు పోయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రతిరోజు ఓ యువతి ఒకే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళటం.. అదే సమయంలో కరెంటు పోవడంతో కొందరికి అనుమానం వచ్చింది.

దాంతో గ్రామస్తులు నిఘా పెట్టారు. గ్రామానికి చెందిన ఆ యువతి తన ప్రియుడిని కలిసేందుకు గ్రామం మొత్తానికి కరెంట్ కట్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలానే జరగడంతో గ్రామస్తులు ఆ యువతని ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం వారిని చితక భాదారు. అర్ధరాత్రి తన బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు వీలుగా ఇలా కరెంట్ కట్ చేస్తున్నట్లు అప్పుడు ఆమె అంగీకరించింది.

ఈ ఘటన వెలుగులోకి రావడం వల్ల గ్రామస్తులు అంతా భయాందోళనకు గురవుతున్నారు. తన ప్రియుడిని కలిసేందుకు ఎంతకు తెగించింది. అంటూ గ్రామస్తులు ఆమెను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు