Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నేను చావును నిరాకరిస్తున్నాను.. సాయిబాబా వీరుడు, ఎవరికి లొంగలేదు..!

Miryalaguda : నేను చావును నిరాకరిస్తున్నాను.. సాయిబాబా వీరుడు, ఎవరికి లొంగలేదు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

“నేను చావును నిరాకరిస్తున్నాను.”. అన్న సాయిబాబా ను రాజ్యం తో కలిసి చంపేసాం.. తాను చనిపోతాడు ఆరోగ్యం బాగాలేదని గత పదేళ్లుగా వసంత చెబుతూనే వుంది..

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, మనం అందరం కలిసి చంపేశామ్.. అని తెలంగాణ మట్టి మనిషి మనుషి వేనేపల్లి పాండురంగారావు పేర్కొన్నారు. సాయిబాబా మరణ వార్త విని ఇలా స్పందించారు. చనిపోతాడని తెలిసి. జరిపిన కుట్ర. ఈ కుట్ర లో అందరం బాగస్వాములమే.

సాయిబాబా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. జాతుల సమస్యల మీద విసృతంగా పని చేశారు.. గొప్ప మేధావి విద్యావంతుడు. బహుముఖ ప్రజ్ఞశాలి.
బాహుభాషా పండితుడు. ఉద్యమం పత్రికా సంపాదకుడు. అన్ని ఆస్తిత్వ ఉద్యమాలకు వెన్ను ధన్నుగా నిలిచాడు..

నల్లగొండ జిల్లా తో ఎంతో అనుబంధం వుంది.
గతం లో ఉద్యమం పని మీద ఆలగడప లో గడిపాడు. ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగు గాగానే మళ్ళీ ఆలగడప కు రావాలనుకున్నాడు.

అతని సోదరి భవాని పీపుల్స్ వార్ పార్టీ లో నల్గొండ జిల్లా సభ్యురాలిగా పనిచేసి నాంపల్లి మండలం పసునూరు దగ్గర బూటకపు ఎదురుకాల్పుల్లో మరణించింది. సాయిబాబా కాళ్ళు పూర్తిగా లేకున్నా తన కళ్ళు గొంతు లేనివాళ్లకు ఇచ్చాడు
శరీరం అంతా రోగాల మయం అయినా ప్రజల గాయల గురించే రాసాడు మాట్లాడాడు.

బతికి వున్నప్పుడు కూడా తన శరీరాన్ని పూర్తిగా ప్రజలకే అర్పించాడు తన మరణ శరీరాన్ని కూడా వైద్య విద్యార్థులకు ఇవ్వమన్నాడు..సాయిబాబా వీరుడు ఎవరికి లొంగలేదు. శరీరం అష్ట వంకర్లు పోయినా దేనికి వంగలేదు. సాయిబాబా ను కోల్పోవడం అంటే మన ల్ని మనం కోల్పోవడమే.

LATEST NEWS : 

మరిన్ని వార్తలు