Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవైద్యం

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. శానిటేషన్ పై అసంతృప్తి..!

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. శానిటేషన్ పై అసంతృప్తి..!

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా మెట్ పల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. ప్రతి రోజు ఎన్ని ఓ.పి.లు చూస్తున్నారు అని డేటానీ అడిగి తెలుసుకున్నారు.

ప్రసూతి వైద్య సేవలను, ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, ఐ.సి.యు. వార్డులు, సిటీ స్కాన్, స్కానింగ్ రూమ్, ఎక్స్-రే, కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, శుభ్రమైన మంచినీరు అందిస్తున్నారా..? రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా..? లేదా..? అని అడిగి తెలుసుకుని వైద్యులకు సూచించారు.

పేషేంట్లకు అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉందా..? అని వంట రూమ్ ను తనిఖీ చేసి వంట సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషేంట్లకి ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని ఆదేశించారు.

ఆసుపత్రి ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా చెత్త చెదారాన్ని, పనికిరాని స్క్రాప్ ను తొలగించాలని శానిటేషన్ ఇంచార్జీని ఆదేశించారు. కలెక్టర్ వెంట మెట్ పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, డిప్యూటీ డియం అండ్ హెచ్ ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

నల్గొండ జిల్లాలో తూములు మూసేసి, రాత్రిపూట కాపలా పెట్టి.. సాగర్ నీటిని ఖమ్మంకు తరలింపు..!

NALGONDA : మున్సిపాలిటీలలో 26 నుంచి ఇంటింటి సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..! 

మరిన్ని వార్తలు