Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై క్రిమినల్ చర్యలు..!

District collector : ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై క్రిమినల్ చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి

అర్హత లేని వైద్యులు చికిత్స చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ, టి జి యం సి, ఐ యమ్ ఎ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిపై సమాజం లో గౌరవం ఉన్నదని అట్టి వైద్య వృత్తి పై ప్రజలు నమ్మకం కోల్పోకుండా వైద్యులు భాద్యతగా ఉండాలి అని తెలిపారు.

అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా వ్యవహారిస్తూ నకిలీ డిగ్రీ లతో క్షేత్ర స్థాయి లో చికిత్స లు అందిస్తు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదం లోకి నేడుతున్న వైద్యులని ఉపేక్షేంచేది లేదని ఐపీసి ప్రకారం క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని తెలిపారు.

డి యం అండ్ హెచ్ ఓ అలాగే ఐ యం ఏ ప్రతినిధులు 3 బృంధాలుగా ఏర్పడి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, పి సి పి యన్ డి టి యాక్ట్ లలోని నిబంధనల ప్రకారం జిల్లాలోని ప్రతి హాస్పిటల్ ని, డయాగ్నస్టిక్ సెంటర్లని పరిశీలించి  అర్హత లేని డాక్టర్లను, ల్యాబ్ టెక్నీషియన్స్ లను ,రిజిస్ట్రేషన్ సర్టిపికెట్ లేని డాక్టర్లను,ఒక హాస్పిటల్ లో అనుమతి తీసుకొని మరో హాస్పిటల్ లో పని చేసే వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని తెలిపారు. విచారణలో తప్పు అని రుజువైతే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.

అనుమతి తీసుకునేటప్పుడు ఉన్న డాక్టర్ ప్రస్తుతం లేకపోతే కొత్త డాక్టర్ వివరాలను సమర్పించాలని హాస్పిటల్ యజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.హాస్పిటల్ లో ప్రైమరీ డాక్టర్ ఉంటేనే కన్సల్టెన్సీ డాక్టర్ కి అనుమతి ఇవ్వాలని అలాగే కన్సల్టెన్సీ డాక్టర్ లు ఎన్ని రోజులు ఏఏ సమయాలలో హాస్పిటల్ ని సందర్శిస్తారో అట్టి వివరాలను తెలియజేయాలనీ హాస్పిటల్స్ యాజమాన్యానికి సూచించారు.

మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ లో అర్హత ఉన్న డాక్టర్లు, స్తాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో లేరో పరిశీలించి నోటీసులు ఇచ్చి లేకపోతే హాస్పిటల్ పడకల సామర్థ్యము తగ్గించాలని డి యం హెచ్ ఓ కి సూచించారు.ప్రతి రోజు 3 బృందాలు పరిశీలించిన హాస్పిటల్ వివరాలు డి యం హెచ్ ఓ తెలియజేయాలనీ, అలాగే ప్రతి వారం వైద్య ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తానని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.

సూర్యాపేట పట్టణంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న ఆపిల్ స్కాన్ సెంటర్, శరత్ కార్డియాక్ సెంటర్ లు మూసి వేయటం జరిగిందని సాయి గణేష్ హాస్పిటల్,శ్రీ కృష్ణ హాస్పిటల్ పై ఆర్డీవో అధ్యక్షతన డి యం హెచ్ ఓ,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్,ఐ యం ఎ నుండి ఒక్క డాక్టర్ సభ్యులుగా విచారణ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని నోటీసులు ఇచ్చి విచారించాలని విచారణలో అర్హత లేని డాక్టర్ లతో తప్పుడు అనుమతులతో హాస్పిటల్ నిర్వహిస్తున్నట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తదుపరి అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యాధి తగ్గించి ప్రాణాలు కాపాడుతారని డాక్టర్ పై నమ్మకం తో హాస్పిటల్ కి వస్తారని వారి నమ్మకం కోల్పోకుండా భాద్యతయుతంగా డాక్టర్లు విధులు నిర్వహించాలని వైద్యం అనేది వ్యాపారం దృష్ట్యా కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి వైద్య సేవలు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు హాస్పిటల్ భవనం కి అనుమతి ఇచ్చేటప్పుడు హాస్పిటల్ వివరాలు సేకరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డి యం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం, డిప్యూటీ డి యం హెచ్ ఓ లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయ మనోహరి, పి యం హెచ్ యన్ డాక్టర్ అనితరాణి ఐ యం ఏ ప్రతినిధులు డాక్టర్ దయాకర్ రెడ్డి, డాక్టర్ రమేష్, డాక్టర్ ఆనంద్ గాంబ్లె, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ అనూష, టి జి యం సి సభ్యులు రాజీవ్ నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Hyderabad : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్.. 40 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి..!

  3. Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!

  4. Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!

  5. Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!

మరిన్ని వార్తలు