TOP STORIESBreaking News

Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

రైతు భరోసా పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ లో కేవలం 4 ఎకరాల లోపు సాగు చేసిన రైతులకు మాత్రమే పంట సహాయం అందింది. వానాకాలం సీజన్ కూడా వచ్చింది. రైతు భరోసా కు సంబంధించి పాత నిధులు కూడా విడుదల చేయకపోవడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

అంతే కాకుండా రైతు భరోసా పథకం పై రైతుల్లో నిరాశ కలుగుతుంది. యాసంగి సీజన్ కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతులు ఇంకా ఎప్పుడు.. ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. కాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతు భరోసా ఎప్పుడిచ్చే విషయంపై స్పష్టం చేశారు.

వానాకాలం వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే రైతు భరోసా పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని తెలిపారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై క్లిలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  2. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

  4. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు