TVS : భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్..!

TVS : భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్..!
TVS NTORQ 150 ని విడుదల చేసిన టీవీఎస్ మోటర్ కంపెనీ
• ఈ విభాగం లో అత్యున్నత వేగం: 6.3 సెకన్లలో 0-60 కి.మీ/గంట అందుకుంటుంది.
• ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో మెరుగైన భద్రత మరియు నియంత్రణ
• సిగ్నేచర్ MULTIPOINT® ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ కాంబినేషన్ ల్యాంప్‌లు & ‘T’- టెయిల్‌ల్యాంప్‌లు
• కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన అధునాతన TFT క్లస్టర్‌తో సహజమైన రైడ్ అనుభవం
• ఈ విభాగంలో మొట్టమొదటి సారిగా అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్‌తో స్మార్ట్ రైడ్ అనుభవాలు సొంతం చేసుకోవచ్చు.
• స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి ప్రేరణ పొందిన ఈ స్కూటర్ ఫ్యూచరిస్టిక్, స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది.
హైదరాబాద్, మన సాక్షి:
రెండు మరియు మూడు చక్రాల వాహన విభాగాలలో ప్రపంచ అగ్రగామి అయిన టీవీఎస్ మోటర్ కంపెనీ (TVSM), నేడు భారతదేశపు వేగవంతమైన హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని విడుదల చేసినట్లు వెల్లడించింది. 149.7cc రేస్-ట్యూన్డ్ ఇంజిన్‌తో నడిచే ఈ స్కూటర్, స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్‌తో ప్రేరణ పొందింది. కొత్త తరం రైడర్లను ఆకర్షించే రీతిలో అధిక పనితీరు, స్పోర్టియర్ సౌందర్యం, అత్యాధునిక సాంకేతికత ల సమ్మేళనం గా తీర్చి దిద్దబడిన ఈ వాహన ప్రత్యేక ప్రారంభ ధర రూ. 119,000 (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా).
ఎల్లప్పుడూ ఆసక్తిని రేకెత్తించే TVS NTORQ స్పూర్తి దాయక కథ ఆధారంగా రూపొందించబడిన ఈ కొత్త స్కూటర్ రేపటికి మరో చిహ్నంగా నిలుస్తుంది. దీని MULTIPOINT® ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ వింగ్లెట్లు, రంగుల అల్లాయ్ వీల్స్ మరియు సిగ్నేచర్ మఫ్లర్ నోట్ దాని రేసింగ్ DNAని హైలైట్ చేస్తాయి, అయితే అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, లైవ్ ట్రాకింగ్, నావిగేషన్ మరియు OTA అప్డేట్లతో సహా 50+ స్మార్ట్ ఫీచర్లతో కూడిన హై-రెస్ TFT క్లస్టర్ దీనిని దాని విభాగం లో అత్యంత అధునాతన స్కూటర్‌గా మారుస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి టీవీఎస్ మోటర్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – హెడ్,కమ్యూటర్ & ఈవీ బిజినెస్ మరియు హెడ్ – కార్పొరేట్ బ్రాండ్ & మీడియా శ్రీ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ, “రెండు మిలియన్లకు పైగా NTORQians, 50 స్వీయ-నిర్వహణ రైడ్ గ్రూపులు, కమ్యూనిటీలు భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, ఐకానిక్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటి గా దాని రైడర్ల తో నిర్మించబడిన సంబంధాన్ని నిర్వచిస్తాయి.
టీవీఎస్ NTORQ అద్భుతమైన డిజైన్, అత్యుత్తమ పనితీరు, కొత్త తరం సాంకేతికతకు పర్యాయపదంగా ఉంది. పూర్తిగా కొత్త టీవీఎస్ NTORQ 150 పరిచయం జెన్ జి యొక్క మారుతున్న ఆకాంక్షలను తీర్చడానికి రూపొందించబడింది! టీవీఎస్ NTORQ 150, భారతదేశపు మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్, దాని హైపర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, హైపర్ ట్యూన్డ్ పనితీరు, హైపర్ కనెక్ట్ చేయబడిన సాంకేతికతతో దాని రైడర్లను థ్రిల్ చేస్తుంది. టీవీఎస్ NTORQ బ్రాండ్ ఫ్రాంచైజీని గణనీయంగా వృద్ధి చేస్తోంది మరియు విస్తరిస్తుంది” అని అన్నారు.
పనితీరు
TVS NTORQ 150 149.7cc, ఎయిర్-కూల్డ్, O3CTech ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 7,000 rpm వద్ద 13.2 PS మరియు 5,500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను అందిస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0–60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది . ఇది 104 కిమీ/గం గరిష్ట వేగాన్ని అందుకుంటుంది, ఇది దాని శ్రేణిలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా నిలుస్తుంది.
స్పోర్టీ & ఫ్యూచరిస్టిక్ డిజైన్
స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి ప్రేరణ పొందిన TVS NTORQ 150లో MULTIPOINT® ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ టెయిల్ ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ వింగ్లెట్లు, సిగ్నేచర్ సౌండ్‌తో కూడిన స్టబ్బీ మఫ్లర్, నేకెడ్ హ్యాండిల్‌బార్ మరియు రంగుల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
కలర్ ప్యాలెట్
TVS NTORQ 150 రెండు వేరియంట్లలో అందించబడుతుంది:
TVS NTORQ 150 – స్టెల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ లో లభిస్తుంది.
TFT క్లస్టర్‌తో TVS NTORQ 150 – నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ లో లభిస్తుంది.
MOST READ :
-
Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!
-
Madgulapally : మతసామరస్యానికి ప్రతీక.. వేలంపాటలో గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం మహిళ..!









