Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

నల్లగొండ, మన సాక్షి :

హైదరాబాద్ నల్గొండ పరిసర ప్రాంతాలలో అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 300 కోట్ల రూపాయలు డైరెక్టర్ల ద్వారా వసూలు చేసి బోర్టు తిప్పేసిన 12 క్యాపిటల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఇంటిముందు సోమవారం నల్గొండ లోని హైదరాబాదు రోడ్డు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ రాపోలు ప్రకాష్ ఇంటి ముందు బాధితులు ఆందోళన నిర్వహించారు.

ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు డైరెక్టర్ ను అదుపులోకి తీసుకొని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చర్చలు జరుపుతున్నారు. బాధితులు తెలియజేసిన వివరణ ప్రకారం హైదరాబాద్ మియాపూర్ లో 12 కాపిటల్ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి 12 మంది డైరెక్టర్లు నియమించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామని చెప్పి 100 కి నాలుగు రూపాయల వడ్డీ చొప్పున డైరెక్టర్ల ద్వారా 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.

బాధితులకు 25 నెలల తర్వాత అసలు వడ్డీ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ ఇచ్చారని కానీ ఆరు నెలలకే బోర్డు తిప్పేసారని బాధితులు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు.

హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన రాచాల లలిత తన ప్లాట్లు బంగారం అన్ని కోటి ఆరు లక్షల రూపాయలు ఇచ్చారని ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, తన భర్త అనారోగ్యం పాలయ్యాడని తాము చితికిపోయాయని తమ డబ్బులు తమకు ఇప్పించాలని దీనంగా వేడుకుంటుంది.

పోలీసులు ప్రభుత్వం అధిక వడ్డీ ఆశకు పోయి డబ్బు చెల్లించవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడంలేదు.

MOST READ : 

  1. Nalgonda : సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా కిడ్నాప్..!

  2. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..!

  4. Nalgonda : క్రీడాకారులకు టోకెన్లు ఇచ్చారు.. తీరా సమయానికి భోజనం లేదని చెప్పారు..!

మరిన్ని వార్తలు