Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా కిడ్నాప్..!

Nalgonda : సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా కిడ్నాప్..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం సర్పంచ్ గా తన భార్య నామినేషన్ వేయడానికి సిద్ధమవుతుండగా తనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తిప్పారని, కార్లు మారుస్తూ తన బట్టలు మారుస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ నామినేషన్ వేస్తే తనను చంపుతామని కత్తులతో బెదిరిస్తూ మధ్యములో మూత్రం పోసి తాగించారని ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన మామిడి యాదగిరి తెలిపారు.

ఆదివారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘం భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మామిడి యాదగిరి తన భార్య లక్ష్మితో కలిసి మాట్లాడారు. తమ గ్రామానికి చెందిన ఊట్కూరు సందీప్ రెడ్డి రౌడీలను పెట్టి తనను కత్తులతో బెదిరించి హత్య చేస్తామని కారులో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ఫామ్హౌజులలో ఉంచి నామినేషన్ వేయడం ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారన్నారు.

ఇదే సమయంలో ఎల్లమ్మగూడెంలో తన భార్య లక్ష్మి బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిలు తన అనుచరులతో ఆందోళన చేయడంతో కిడ్నాపర్లు తనను తిప్పర్తి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారన్నారు.తిప్పర్తి పోలీసులు తనతో తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారని యాదగిరి తెలిపారు.

తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని తనకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఎల్లమ్మ గూడెం సర్పంచ్ గా జనరల్ మహిళ రిజర్వేషన్ కావడంతో యాదవ కులానికి చెందిన లక్ష్మీ పోటీ చేయడంతో తట్టుకోలేని సందీప్ రెడ్డి తన అనుచరులతో కిడ్నాప్ చేసి చంపుతానని మూత్రం తాగించడం అనాగరిక చర్యని దీనిని సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

బాదిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ యాదవ సంఘం అoడగా ఉంటుందన్నారు. సందీప్ రెడ్డి నామినేషన్ ఉపసంహరింపజేసి మామిడి లక్ష్మిని ఏకగ్రీవ సర్పంచిగా చేయాలని లేని పక్షంలో తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్,జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్, పురుషోత్తం, సైదులు,అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్..!

  2. CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!

  3. SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!

  4. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు