TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు పండించే రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఒక విడుత 6000 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కాగా ఈ పథకంలో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది.

కొంతమంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో పాటు మరి కొంత మందికి ఎక్కువ భూమి ఉన్నా.. తక్కువ డబ్బులు ఖాతాలలో వచ్చాయి. దాంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

అలాంటి వారికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పై ఫిర్యాదులు స్వీకరించేందుకుగాను రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రతి మండలంలో వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రాలను ప్రారంభించింది. ఫిర్యాదులలో రైతులు రైతు భరోసా రాని వారు, తక్కువ వచ్చిన వారు ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే చేసే అవకాశం ఉంది.

రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తున్న వ్యవసాయ అధికారులు ఏవైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి అందరికీ రైతుబంధు అందేలా చర్యలు తీసుకోనున్నారు.

రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు :

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో రైతు వేదిక నందు మండల వ్యవసాయ అధికారి జి సరిత రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రంను ప్రారంభించారు. రైతు భరోసా పధకం నందు రైతులకు నగదు వారి యొక్క ఖాతాలలో జమ చేయబడతాయని తెలియజేసారు.

రైతు భరోసాపై ఏమైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నచో ఏఈఓలను గాని, మండల వ్యవసాయ అధికారిని గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రావుల నరేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!

  2. Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!

  3. UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!

  4. Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!

  5. Nalgonda : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్ట్..!

మరిన్ని వార్తలు