Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)
Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి చికిత్స అందించారు వైద్యులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాదులోని ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్ క్ గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రో రైలులో గుండెను తరలించారు. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 13 నిమిషాల్లో గుండెను అందించారు.
ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని గుండెను ఖైరతాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు ఈ గుండెను తరలించారు. డాక్టర్ అజయ్ ఘోష్ నేతృత్వంలో వైద్య బృందం చికిత్స నిర్వహించారు.
ఎల్బీనగర్ నుంచి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరి 9:43 గంటలకు చేరుకుంది. పోలీసులు, మెట్రో అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొత్తపేట నుంచి ఖైరతాబాద్ వరకు మెట్రో స్టేషన్ లన్ని మూసివేసి ప్రయాణికులను నిలిపివేశారు. 13 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, 13 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకున్నారు.
(వీడియో )
A heart moved in the Metro to save a life.
Hyderabad Metro created a Green Corridor, covering 13 km in just 13 minutes, ensuring a donor heart reached in time for a life-saving transplant.
On the night of January 17, 2025, Hyderabad metro train ensured the swift transportation… pic.twitter.com/nHYB1vtt7D
— Naveena (@TheNaveena) January 17, 2025
MOST READ :
-
District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!
-
District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!
-
CM Revanth Reddy : సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘనంగా తెలుగువారి స్వాగతం..!
-
Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)
-
Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!
-
Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!









