KTR : ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసుల హైడ్రామా..!
KTR : ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసుల హైడ్రామా..!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్
మన సాక్షి, నలగొండ ప్రతినిధి
ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే నోటీసులు ఇస్తూ హై డ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండలో ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ వివాహానికి హాజరైన ఆయన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 17 నెలలుగా పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ములేదు, తీసుకునే కమిషన్ల మీద ఇవ్వాళ రాష్ట్రము మొత్తం గగ్గోలు పెడుతుంది అన్నారు. చిన్న చిన్న వర్క్స్ చేసుకునే కాంట్రాక్టర్స్ సెక్రటేరియట్ కి వచ్చి 20%, 30% కమిషన్లు తీసుకునే ప్రభుత్వం అని ధర్నాలు చేసారు, చివరకు మంత్రులు, ఎమ్మెల్యే లు సైతం కమిషన్లు లేనిది, పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదని బహిరంగంగానే చెప్తున్నారన్నారు.
ఇలాంటి కమిషన్ల గురించి ప్రజల దృష్టిని మల్లించడానికి కమిషన్ల ఏర్పాటు నోటీసులు అంటూ డ్రామాలు చేస్తుంది, ప్రజా పాలన కాస్త కమిషన్ల పాలనగా మారిపోయింది అన్నారు. రేవంత్ రెడ్డిని నల్లగొండ రైతుల తరుపున, ప్రజల తరుపున అడుగుతున్నా.. ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలి పోయి రేపటితో మూడు నెలలు అవుతుంది, కమిషన్ల కక్కుర్తి తో ఎస్ ఎల్ బి సి సొరంగం కూలి పోతే అందులో చుక్కుకుపోయిన వారి శవాలను తీయలేక పోయారు.
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి పోతే ఇప్పటి వరకు అందుకు కారణమైన సంస్థపై విచారణ లేదు, చర్యలు లేవు అన్నారు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగితే దానిపై చర్యలు లేవు, పెద్దవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోతే దాని మీద చర్యలు లేవు అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ను విఫల ప్రాజెక్ట్ గా ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నాయి. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయవ్యస్తస్త మీద మాకు నమ్మకం ఉన్నది అన్నారు. కమిటీల పేరిట, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ ఆరు గ్యారంటీ ల నుంచి ప్రజల దృష్టి మళ్లీస్తున్నారు, 420 హామీల అమలను పట్టించుకోవడం లేదు… వీటి అమలు కోసం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యే లేదు అన్నారు.
4వేల రూపాయల పెన్షన్స్ ఎప్పుడిస్తారు అని పెన్షనర్లు అడుగుతున్నారు. తులం బంగారం ఎప్పుడిస్తారు అని ఆడబిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా… ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజాల్లా తెలిపోతాయి. ముమ్మాటికీ న్యాయం, ధర్మం గెలుస్తాయి. తెలంగాణ కు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడుతాడు అన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు తిరగబడి స్కంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్తారు.
MOST READ :
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!
-
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం..!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
-
Komatireddy Venkatreddy : రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!









