Nalgonda : జిల్లా వ్యవసాయాదికారి రైతులకు కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..!

Nalgonda : జిల్లా వ్యవసాయాదికారి రైతులకు కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..!
మాడుగుల పల్లి, మన సాక్షి :
జిల్లా వ్యవసాయాదికారి పి.శ్రవణ్ కుమార్ మాడుగులపల్లి మండలం పరిధిలోని గోపాలపురం గ్రామంలో రైతులు సాగు చేసిన పంట పొలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనవి కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియచేసారు.
ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను వరి A గ్రేడ్ రకానికి క్వింటాల్ కి రూ 2389/- గాను,సాధారణ రకానికి రూ 2369/- గాను కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని ఆయన తెలియచేసారు. అంతే కాక తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాల్ కి రూ 500/- లు బోనస్ ప్రకటించడం జరిగిందని ఆయన తెలియచేసారు.
కావున రైతులందరు కూడా కనీస మద్దతు ధరను పొందాలంటే తప్పనిసరిగా నాణ్యత ప్రమాణలను పాటించాలని తేమ శాతం 17% ఉండేవిధంగా, వడ్లలో తాలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యం.శివరాం కుమార్ గారు,వ్యవసాయ విస్తరణ అధికారులు వేణుగోపాల్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కార్యక్రమం రద్దు..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!









