TOP STORIESBreaking Newsటెక్నాలజీహైదరాబాద్

UPI : యూపీఐ పేమెంట్స్ లో సరికొత్త విప్లవం.. ఆశ్చర్యం కల్పించే విధంగా లావాదేవీలు..!

UPI : యూపీఐ పేమెంట్స్ లో సరికొత్త విప్లవం.. ఆశ్చర్యం కల్పించే విధంగా లావాదేవీలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

యూపీఐ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఐదు రూపాయల పేమెంట్స్ నుంచి లక్షల రూపాయల లావాదేవీల వరకు కూడా యూపీఐ ద్వారానే చెల్లింపులు సాగుతున్నాయి.

అందుకు గాను ఎంపీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని మరింత స్మార్ట్ గా తీర్చిదిద్దబోతోంది. ఇక మనిషి అవసరం లేకుండానే ఇంట్లో ఉండే గృహపకరణాలు కూడా యూపీఐ లావాదేవీలను నిర్వహించబోతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ వాచ్ లు కూడా లావాదేవీలు కొనసాగిస్తాయి.

మనం కారు పార్కింగ్ చేయగానే పార్కింగ్ ఫీజు కూడా కారు చెల్లిస్తుంది.. మెట్రో టికెట్టు మన చేతి వాచి కొనుగోలు చేస్తుంది.. ఇలాంటి వెసులుబాటులో యూపిఐ తీసుకురాబోతుంది. అయితే ఇప్పుడు యూపీఐ చెల్లించాలంటే మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. దానికి యూపీఐ ఐడి ఉంటుంది.

ప్రస్తుతం యుపిఐ సర్కిల్ చెల్లింపుల వ్యవస్థ కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి సెకండరీ యూజర్ కూడా చెల్లింపులు చేసే సదుపాయాన్ని కల్పించబోతోంది. ఆయా డివైజ్ లు కూడా వ్యక్తుల ప్రైమరీ ఖాతాకు అనుసంధానమై ఉంటాయి. వాటికి ఒక ప్రత్యేకంగా యూపీఐ ఐడి కూడా ఉంటుంది.

ఒకసారి ప్రైమరీ యూజర్ అనుమతి తీసుకున్నాక వ్యక్తి అవసరం లేకుండానే చెల్లింపులు చేస్తాయి. ఈ సంవత్సరం జరగబోయే గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ఈ ఐఓటి రెడీ యూపీఐ ని ప్రదర్శించే అవకాశం ఉంది.

Similar News : 

  1. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

  2. UPI : డిజిటల్ పేమెంట్స్ లో మోసాలకు చెక్..!

  3. GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

  4. Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు