క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Finger Print : నేరాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు..!
Finger Print : నేరాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో దొంగతనాల నివారణకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ఎక్లాస్పూర్ ప్రధాన రహదారిపై ఫింగర్ ప్రింట్ డివైస్ తో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే పోయే వాహనాలను, అపరిచిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగిన, కనిపించిన వెంటనే ప్రజలు లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని
ఎస్సై కోరారు.









