Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!
Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
బంగారం ధర కాస్త తగ్గింది. దాంతో కొంత మేరకు పసిడి ప్రియులకు ఊరట కలిగింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర కాస్త తగ్గింది. తులం బంగారం ధర లక్షకు దిగువకు వచ్చింది. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం కారణంగానే బంగారం ధర తగ్గిందని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. ఇదే నిజమైతే బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు సోమవారం 8200 తగ్గి 9,98,700 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 7,500 తగ్గి 9,15,500 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే..!
హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్స్ (తులం) బంగారం సోమవారం 99,870 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 91,550 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలలో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
MOST READ :
-
District Collector : ప్రజావాణికి 66 ఫిర్యాదులు.. సత్వరమే పరిష్కరించాలి..!
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
-
Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!
-
Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!









