TG News : తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..
TG News : తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..
నల్లగొండ, మన సాక్షి :
బిఆర్ఏస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా కార్యకర్తలు తరలిరావాలని మాజీ మంత్రి గెలిచేది పిలుపునిచ్చారు. ఆదివారం బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలు పెట్టడం లో గిన్నిస్ రికార్డ్ మన సొంతం అని పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి అతను బిఆర్ ఎస్ ఉండదు, మధ్యలోనే బంద్ అయితది అని శాపనార్థాలు పెట్టిండన్నారు.
మొదటి వార్షికోత్సవ సభ నల్గొండ లొ పెట్టి సూపర్ సక్సెస్ చేసినమ్ ఎన్నో మైలు రాళ్లను అధిరోహించినం మిము రాక్షసులను తరిమికొట్టినం.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పి మోసం చేస్తే మన పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వాదం ఉంది అని నల్గొండ జిల్లాలో ఎన్నో సభలు పెట్టినం ఉద్యమంలో నల్గొండ జిల్లా స్థానం పదిలం మన జిల్లా ఉద్యమాల జిల్లా ఇక నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారిండు కోమటిరెడ్డి ఉత్తి చేతకాని మంత్రని విమర్శించారు.
వీళ్ళ చేతకాని తనం వల్లనే రైతులపై మిల్లర్లు, దళారులు దాడులకు దిగుతున్నారు. ఇవ్వాళ మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు దళారులు కలిసి రైతులపై దాడులకు దిగుతున్నారని నిన్న సూర్యపేట లో ఓ రైతు మద్దతు ధర రాక ధాన్యం రాశులకు నిప్పు పెట్టుకున్నాడని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
ఎస్ ఎల్ బి సి ని శాశ్వతంగా మూసి వేసే కుట్ర చేస్తున్నారు. ఈ దద్దమ్మలు ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేసే దమ్ము లేదు వీళ్లకు అందులో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికితీసే దమ్ము, తెలివి ఈ కాంగ్రెస్ నాయకులకు లేదురేవంత్ ఆంటోన్నీ ఎన్ని రోజులు భరించాలి అని ప్రజలు బాధపడుతున్నారు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు దైర్యంగా వున్నారు ప్రతి రైతు గుండెల్లో వున్నాడు కేసీఆర్.. రైతుల ఆత్మబంధువు కేసీఆర్రైతులకు బాధ కలగానే కేసీఆర్ ఉంటే బాగుండు అని తలుచుకుంటున్నారుగీ తాగుబోతు కాంగ్రెస్ నాయకులకు మీము భయపడం గీ కేస్ లకు భయపడ వాళ్ళు చేసే అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు.
కాంగ్రెస్ అంటేనే హౌలా గాళ్ళు పాగల్ గాళ్ళు అంటున్నారు. ప్రజలు మంత్రులు దందా లో మ్యూనిగి తెలుతున్నారు. కోమటిరెడ్డి అనుచరుల దుర్మార్గులాతో నల్గొండ జిల్లా సర్వ నాశనం అవుతున్నది. ప్రజల సహనం నశిస్తే కోమటిరెడ్డి ని నల్గొండ కు కూడా రానివ్వరు విల్లు చేయని దందా లేదు. ప్రభుత్వ హాస్టల్స్ లలో కల్తీ నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
కోమటిరెడ్డి మనుష్యుల ఇది దుర్మార్గం వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అన్నారూ. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మల్లికార్జున్రెడ్డి దీప వెంకట్ రెడ్డి, బోనగిరి దేవేందర్ జమాల్ ఖాద్రి కౌన్సిలర్లు వివిధ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ :
-
BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకున్న బీఓఐ..!
-
Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!
-
Miryalaguda : ఘనంగా తిరునగరు గంగాధర్ జయంతి..!
-
District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!
-
Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!










