ఆంధ్రప్రదేశ్Breaking Newsవ్యవసాయం

Tomato : టమాట పంటను ధ్వంసం చేసిన దుండగులు..!

Tomato : టమాట పంటను ధ్వంసం చేసిన దుండగులు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మార్కెట్‌లో టమాటకు భారీ డిమాండ్‌ ఉండగా ఈ పంటతో తన కష్టాలు తీరుతాయనుకున్న వైసిపి మద్దతుదారుడైన రైతుకు చెందిన పంట ద్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రశ్నించారు. టమాట పంట మరికొన్ని రోజులలో చేతికొచ్చే సమయంలో పంటను నాశనం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ గొల్లపల్లిలో రైతు హరిక్రిష్ణ కు చెందిన టమోటా పంట మొక్కలు ఏపుగా పెరిగిన ఉన్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు టమాట మొక్కలు పీకేసి తీరని నష్టాన్ని మిగిల్చారు.

బాధిత రైతు రామసముద్రం మండలంలో నిస్సార్ అహమ్మద్ బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టిన సమయంలో రైతు హరిక్రిష్ణ నిస్సార్ అహమ్మద్ కు తమ గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన నిస్సార్ అహమ్మద్ వెంకటనే స్దానిక వైసిపి నాయకులతో కలిసి రైతు హరిక్రిష్ణ పొలంలోని టమోటా పంట పరిశీలించారు.

ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి టమాటను సాగుచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారని రైతు హరిక్రిష్ణ తెలియజేయడం జరిగిందని వివరించారు.

టమాట మంచి ధర పలుకుతున్న తరుణంలో ఈ ఘటనతో రైతు తీవ్ర నిరాశకు గురైయ్యారని అన్నారు. రాజకీయ కక్ష్యలతో పంటలు ద్వంసం చేయడం లాంటి సంస్కృతి మదనపల్లె ప్రాంతాలలో చోటు చేసుకోవడం తీవ్ర భయాందోళన కలిగిస్తుందని అన్నారు.

దీనిపై సత్వరం పోలీసులు కేసు నమోదు చేసి, పంట ద్వంసం చేసిన దుండగులపై కేసు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు హరిక్రిష్ణ తెలిపారు.

MOST READ :

  1. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  2. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  3. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  4. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

మరిన్ని వార్తలు