Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!
Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
పోలీసు శాఖలో ఎవరో ఒకరు చేసే పనికి వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది. పలువురు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వస్తున్నాయి. పోలీసులే అలాంటి పనులకు పాల్పడుతూ సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల ప్రకారం కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. కాగా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారి ఆమెని పక్కన ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదంతా ఆ మహిళతో వచ్చిన మరో వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. అంతేకాకుండా దీనిపై ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు సైతం ఖండించాయి. ఏది ఏమైనా కర్ణాటకలో మాత్రం ఈ వైరల్ వీడియో సంచలనం కలిగించింది.
VIDEO
https://twitter.com/HateDetectors/status/1875083297627488589?t=K6XOJ__QwNNv8eswEPdtow&s=19
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!
-
District collector : ఉపాధ్యాయులతో కాఫీ విత్ జిల్లా కలెక్టర్..!
-
Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!









