Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : సరిహద్దులో నిత్యం నిఘా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం..!

మిర్యాలగూడ : సరిహద్దులో నిత్యం నిఘా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం..!

అడవిదేవులపల్లి, మన సాక్షి:

రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం నిఘా ఉండాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలు జారీ చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవుల పల్లి పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీసు స్టేషన్ పరిధిలోని స్థితిగతులు గురించి యస్.ఐని అడిగి తెలుసుకుని, రిసెప్షన్,స్టేషన్ రైటర్,లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీసు స్టేషన్లో ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని,సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన పెంచాలని,రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర సరిహద్దు వెంట అక్రమ గంజాయి రవాణా, పిడీయస్ బియ్యం అక్రమ రవాణా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

పగలు రాత్రి 24/7 పెట్రొలింగ్ బీట్లు నిర్వహించాలని పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, అడవిదేవులపల్లి యస్.ఐ శేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు