బతికుండగానే చంపేశారు.. సారూ.. ఇంకా నేను చనిపోలేదు..!
బతికుండగానే చంపేశారు.. సారూ.. ఇంకా నేను చనిపోలేదు..!
దేవరకొండ, మనసాక్షి :
బ్రతుకున్న మహిళను చనిపోయినట్టుగా నిర్ధారించి మరణ ధ్రువీకరణ పత్రం తీసి వారికి ఉన్నటువంటి మూడు ఎకరాల భూమిని పట్టాను చేసుకునేందుకు అప్పటి బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచి ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కాచారం గ్రామపంచాయతీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు పెద్దమ్మ ఆమె భర్త అచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కచారాం గ్రామానికి చెందిన అబ్బనబోయిన పెద్దమ్మ భూమిపై గ్రామ మాజీ సర్పంచ్ నోముల లక్ష్మీశ్రీ,ఆమె భర్త యాదయ్య కన్నేశారు. పెద్దమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండగా,ఇద్దరు కుమారులు బతుకుతెరువు కోసం హైదరాబాదులో నివసిస్తున్నారు.
ఇదే అదునుగా తీసుకున్న సర్పంచ్ ఆమె భూమిని ఎలాగైనా పట్ట చేసుకోవాలని తాపత్రయంతో పెద్దమ్మ చనిపోయిన ట్టుగా 29/10/2020 ఆమె మరణించిందని, కుమార్తె ఒక్కతే ఉందని, ఆ కుమార్తె కూడా మాజీ సర్పంచ్ లక్ష్మిశ్రీ గా చిత్రీకరించి, గ్రామంలోని సర్వే నెంబర్ 13/12/1 లో పెద్దమ్మ పేరుతో నమోదైన మూడు ఎకరాల భూమికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆమెకు కుమారులు ఎవరూ లేరని, కుమార్తె ఒక్కతే ఉందని, భూమి పట్టా పెండింగ్లో ఉందని రెవిన్యూ శాఖను నమ్మించారు. ఇదే విషయమై దేవరకొండ ఆరి గోపరాజు గ్రామంలోకి వెళ్లి విచారణ చేస్తుండగా పెద్దమ్మ బతికే ఉందని చెప్పడంతో మాజీ సర్పంచ్ లీలలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులు అప్రమత్తమై దరఖాస్తుని తిరస్కరించారు.
విషయం తెలుసుకున్న పెద్దమ్మ కుమారులు, కుమార్తె మంగళవారం దేవరకొండ ఎమ్మార్వో సంతోష్, అడిషనల్ ఎస్పీ మౌనికకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఒక విధంగా ఉంటే అసలు మరణ ధ్రువీకరణ పత్రం ఎవరిచ్చారు..? అధికారులు ఇచ్చారా..? మాజీ సర్పంచ్ ఫోర్జరీ చేశారా అనే అనుమానం గ్రామంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి మాజీ సర్పంచ్ కు సంబంధించిన సర్టిఫికెట్లను ఇవ్వాలని ఎమ్మార్వో కోరగా మా దగ్గర సంబంధించిన సర్టిఫికెట్లు లేవని ఎమ్మార్వో మాట దాటవేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం బయటికి పొక్కడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఆన్లైన్లో ఉన్నటువంటి దరఖాస్తుని వెంటనే డిలీట్ చేశారని, పౌతి ఆన్లైన్లో నిలిపివేశారు.
ఇట్టి విషయంపై మాజీ సర్పంచ్ ని బాధితులు నిలదీయగా తాము తప్పు చేశామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అధికారుల సపోర్టు,రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతోనే అతను ఈ విధంగా చేశారని, గతంలో కూడా ఇలాంటి ఆరో పణలు చాలా ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు.
MOST READ :
-
Miryalaguda : మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఇక డే బై డే సమీక్ష..!
-
District collector : యువతకి చాలా భవిష్యత్తు ఉంది.. మత్తుకు బానిస కావొద్దు.. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి..!
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి.. పారదర్శకంగా భూభారతి..!
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!









