Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!

Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!
సంస్థాన్ నారాయణపూరం, మన సాక్షి:
స్నేహితులు సుఖాల్లోనే కాదు,కష్టాల్లోనూ తొడుంటాము అని నిరూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూరం మండల కేంద్రానికి చెందిన రాపోలు రాజేష్ అనారోగ్యంతో మృతి చెందారు. చిన్న నాటి నుండి కలిసి చదువుకున్న వారి మిత్రులు 1994-95 పదవ తరగతి స్నేహబంధం టీం మిత్రులు అందరు కలిసి ఆదివారం రోజున లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు(104500/-) వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ ఆర్థిక సహాయం రాజేష్ కూతురు మౌన్యశ్రీ పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది.డిపాజిట్ పాస్ బుక్ ని రాజేష్ కుటుంబానికి వారి నివాసంలో అందజేసి పరామర్శించారు. అనంతరం టీం మిత్రులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మిత్రులకి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలనీ స్నేహితులను కోరారు.భవిష్యత్తులో రాజేష్ కుటుంబానికి వారి పిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పున్న యాదగిరి, పొట్ట సత్తయ్య గౌడ్, సురుకంటి రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వందనపు నాగేష్, బద్దుల మల్లేష్ యాదవ్, వీరమల్ల అంజయ్య గౌడ్, పిన్నింటి రామిరెడ్డి, పోలోజు వెంకటాచారి, ఈదులకంటి కైలాసం గౌడ్, కొండ్రు మహేష్, సురపల్లి శ్రీనివాస్, శానాజ్ బేగం తదితరులు చిన్న నాటి మిత్రులు పాల్గొన్నారు.
MOST READ :
-
Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!
-
Paddy procurement : ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రైతుల రాస్తారోకో..!
-
District SP : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. దౌర్జన్యాలు, బెదిరింపులకు గురి చేస్తే కఠిన చర్యలు..!
-
District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!









