Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అంతర్రాష్ట్ర దొంగ పిట్ట గంగాధరను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ. 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మౌనిక మీడియాకు తెలిపారు.
దొంగతనం వివరాలు
దేవరకొండలోని హనుమాన్ నగర్‌లో ఏప్రిల్ నెలలో కట్ల రమేష్ అనే వైద్యుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఇంటి యజమానులు బయటకి వెళ్లడంతో దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారాన్ని అపహరించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడి నేపథ్యం
అరెస్టు అయిన పిట్ట గంగాధరది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఇతడు ప్రధానంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తాడు. జూదం, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 100కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్పీ మౌనిక వెల్లడించారు.
అరెస్టు, రికవరీ
ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ దొంగతనం చేసింది పిట్ట గంగాధర అని గుర్తించి, అతడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
అతని నుంచి పోలీసులు రూ. 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సమర్థవంతంగా పరిష్కరించిన పోలీసు బృందాన్ని ఏఎస్పీ మౌనిక అభినందించారు. ప్రజలు తమ ఇళ్లకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.
ఈ కేసు దర్యాప్తులో దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై నారాయణరెడ్డి, ఎస్సై మౌనిక, రైటర్ చందపాషా, కానిస్టేబుల్ అంజి, కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ వెంకన్న, మహిళా కానిస్టేబుల్ షేక్ ఇమ్రాన, హోమ్ గార్డ్ సింహాద్రి పాల్గొన్నారు.
MOST READ :
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!
-
District collector : తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
-
Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!









