District collector : తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

District collector : తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
చిట్యాల, మన సాక్షి :
నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో తహసిల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల వారీగా 2017 నుండి మరణించిన వారి వివరాలను తెప్పించుకొని అందులో నుండి కుటుంబ పెద్ద మగ లేదా ఆడ ఎవరు చనిపోయిన వారి వివరాలు సేకరించి సంబంధిత కుటుంబ సభ్యుల సహకారంతో మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ ఇతర ధ్రువపత్రాలను జత చేసి జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను పంపించాలని అన్నారు.
చనిపోయిన పెద్ద ఇంటి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం వస్తున్నందున ఎక్కువ మందికి సహాయం అందించేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కనే ఉన్న నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డితో మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లు పరిశీలించి ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పారు. అనంతరం పిఓపి కేసులు ఇతర భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణ కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ భూములు బదిలీ చేయాలని వినతి..!
-
ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!
-
Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!









