Tomato : మొన్నటి వరకు కిలో టమాట రూ.50 నుంచి రూ.100.. నేడు కిలో రూ.5 నుంచి రూ.10.. ఎందుకు ఇలా..!

Tomato : మొన్నటి వరకు కిలో టమాట రూ.50 నుంచి రూ.100.. నేడు కిలో రూ.5 నుంచి రూ.10.. ఎందుకు ఇలా..!
మన సాక్షి:
మొన్నటి వరకు మార్కెట్లలో కిలో 50 నుంచి 100 రూపాయల రేటు పలికింది. కూరగాయల షాపుల్లో అయితే కిలో 80 నుంచి 100 రూపాయలకు కూడా అమ్మారు. కొన్ని చోట్ల 150 రూపాయలకు కూడా కిలో టమాట అమ్మారు. అయితే దీంట్లో రైతుకు మిగిలేదికిలోకు ఇరవై నుంచి ముప్పై రూపాయలే.
అకాల వర్షాలతో టమాట దిగుబడి తగ్గిపోయింది. అయితే ఇదే విషయం ఇక్కడ రివర్స్ అయ్యింది. మంచి టమాట రావడం లేదని మదనపల్లి మార్కెట్‌కు వ్యాపారులు రాక కిలో టమాట ధర పది రూపాయలకే పడిపోయింది.
కర్నూలులో.. మదనపల్లి తర్వాత…టమాటను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ కూడా కిలో టమాట ధర 5 రూపాయల నుంచి పది రూపాయలే పలుకుతుంది. దీంతో రైతులకు పెట్టుబడి మాట దేవుడెరుగు…ఛార్జీలు కూడా మిగలడం లేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన మార్కట్లైన. నంద్యాల, బనగానపల్లె, ఎమ్మిగనూరు, ప్యాపిలి, ఆస్పరి, పత్తికొండ మార్కెట్లలో కూడా కిలో టమాటా 5 రూపాయలే పలికింది. రైతుల నుంచి 5 రూపాయలకు కొన్న వ్యాపారులు రిటైలర్లకు, వినియోగదారులకు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో పడ్డారు.
ఇక తెలంగాణ వరంగల్ జిల్లాలోని హోల్ సేల్ మార్కెట్‌లో అయితే కిలో టమాట 5 రూపాయాలకు పడిపోయింది. దీంతో టమాటలను రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
టమాట మొన్నటి వరకు రేటు బాగున్నా అకాల వర్షాలు, తుపానుతో కాయలు దెబ్బతిని దిగుబడి సరిగా రాలేదు. అప్పుడు అలా నష్టపోయారు. ఇప్పుడు మంచి టమాట లేక వ్యాపారులు పూర్తిగా ధరలు తగ్గించడంతో…మార్కెట్‌కు తెచ్చిన టమాటలను రోడ్లపైనే పారబోస్తున్నారు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ… టమాట రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రతి యేటా ఒకటి రెండు నెలలు తప్పా రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాట రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని రైతులకు ప్రత్యమ్నాయ మార్గాలను చూపించాలని సామాజిక వేత్తలు అంటున్నారు. ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెడితే ఇలాంటి సమయంలో కొంతలో కొంతైన…రైతులను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చు.
Reporting : NMREDDY
MOST READ :
-
Viral Song : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన పై సెటైరికల్ సాంగ్.. వైరల్.. మీరు చూడండి.. (వీడియో)
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
-
Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్తో జాగ్రత్త..!









