Asara : ఆసరా పింఛన్ల పెంపుకు ముహూర్తం.. రూ. 4 వేలు, రూ. 6 వేలు పెంపుకు కసరత్తు..!
Asara : ఆసరా పింఛన్ల పెంపుకు ముహూర్తం.. రూ. 4 వేలు, రూ. 6 వేలు పెంపుకు కసరత్తు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది.
దాంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు సన్నధాన్యంకు 500 రూపాయల బోనస్ అందజేస్తుంది. కాగా మిగతా హామీలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది.
ఆసరా పింఛన్ల పెంపు పై ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఆసరా పింఛన్ల పెంపు ప్రధాన హామీగా ఉంది. వృద్ధులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు గత ప్రభుత్వం నెలకు రెండు వేల రూపాయలను అందజేస్తుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అదేవిధంగా వికలాంగులకు గత ప్రభుత్వం 4వేల రూపాయలను అందజేస్తుంది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వికలాంగులకు నెలకు 6000 రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడిచినప్పటికీ కూడా వారి గురించి పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
పార్టీ అంతర్గత సమావేశాల్లో పలువురు నాయకులు ఈ విషయాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వం పై వ్యతిరేకత రాకముందే ఆసరా పింఛన్ల పెంపును చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాగా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వారికి నెలకు 4 వేల రూపాయల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు.
అదే విధంగా వికలాంగులకు నెలకు 6000 రూపాయలు అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను కసరత్తు నిర్వహిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చించి ముహూర్తం ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :









