Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Thinmar Mallanna : తీన్మార్ మల్లన్నకు భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్..!

Thinmar Mallanna : తీన్మార్ మల్లన్నకు భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్..!

మన సాక్షి, హైదరాబాద్ :

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల కుల గణన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. దాంతోపాటు బీసీ సభలో ఓ వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నది.

కానీ తీన్మార్ మల్లన్న నోటీసులకు స్పందించలేదు. దాంతో తీవ్రంగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

MOST READ : 

  1. BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు