Nalgonda : జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనే విధంగా ఎదగాలి.. బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్..!

Nalgonda : జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనే విధంగా ఎదగాలి.. బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ,, మన సాక్షి.
విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈనెల 19 నుండి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఎల్ బి సి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం ముగిసాయి.
ముగింపు సందర్భంగా వివిధ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ పాల్గొని బహుమతులను అందజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం అన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు అజహారుద్దీన్ ఉండడం వలన క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
నేటి క్రీడాకారులు జాతీయస్థాయిలో ఆడే విధంగా కష్టపడి చిత్తశుద్ధితో కృషి చేయాలి అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలల విద్యార్థులలో ఉన్న క్రీడా ప్రతిభలు ఈ పోటీలలో వెలువడి మంచి క్రీడాకారునిగా ఎదగడానికి పోటీలు ఉపకారిస్తాయి అన్నారు.
క్రీడలు పోటీ తత్వాన్ని, సోదర భావాన్ని, ఐక్యతను,శారీర దారుడ్యమ్ పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ వేణుగోపాల్, అసిస్టెంట్ సెక్రటరీలు,అబ్దుల్ ఖయ్యూం, మునీర్,ఫరీదుద్దీన్,, హమీద్ విజిలెన్స్ కమిటీ ప్రభాకర్, బీఎండబ్ల్యూ విజేందర్ రెడ్డి, శ్రీకాంత్, డాక్టర్ ఏ ఏ ఖాన్, జాఫర్,మునీరుద్దీన్, ఉమ్మడి జిల్లా నుండి పీఈటీలు పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.









