TOP STORIESBreaking Newsవిద్య

Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?

Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో రేపు సోమవారం పాఠశాలలకు సెలవు వచ్చింది. డిసెంబర్ మాసంలో పాఠశాలలకు సెలవులు తక్కువగా వస్తాయి. జనవరిలో సంక్రాంతి పండుగ రావడంతో జనవరి మాసంలో కూడా పాఠశాలకు మరోసారి సెలవులు రానున్నాయి. డిసెంబరులో పాఠశాలలకు సెలవులు తక్కువగా ఉంటాయి.

కానీ డిసెంబర్ 9వ తేదీన మాత్రం పాఠశాలకు సెలవులు వచ్చాయి. ములుగు జిల్లాలోని చల్పాక అడవుల్లో డిసెంబరు ఒకటవ తేదీన జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు నిచ్చింది. అందులో భాగంగా పాఠశాలలకు కూడా సెలవు ఉంటుందని తెలుస్తోంది.

మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో 9వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలిపిస్తున్నట్లు లేఖల పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. బందును విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దాంతో బంద్ లో భాగంగా రాష్ట్రంలో విద్య సంస్థలు బంద్ పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు