Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఈనెల 15వ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విద్యుత్ కోత విధించనున్నారు. గురువారం మిర్యాలగూడ మండలం, వెంకటాద్రిపాలెం సబ్ స్టేషన్ నందు మరమ్మతు పనులు చేయుచున్నందున, వెంకటాద్రి పాలెం, ఇండస్ట్రియల్ ఏరియా, శ్రీనివాసనగర్, దుబ్బ తండ, తుంగపాడు , నల్లగట్టు తండ, లావుడి తండ, సామ్యగానీ తండ, టీక్య తండ, కేశవా నగర్ కాలనీ, కొత్తూరు, భాగ్య గోపాసముద్రం తండ తదితర గ్రామాల్లో ఉదయం 07.00 గంటల నుండి 11.00 గంటల వరకు విద్యుత్ సరపరా నిలిపివేయబడును.

నందిపాడు సబ్ స్టేషన్ కు వచ్చు 33కేవీ లైన్ లో ఉన్న చెట్లు తొలగించుట కొరకు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న నందిపాడు, ఐలపురo, చిల్లాపురం, ట్యాంక్ తండ, కొక్య తండ, మైసమ్మ తండ తదితర గ్రామాలకు కూడా ఉదయం 07.00 గంటల నుండి 11.00 గంటల వరకు కరెంట్ సప్లయ్ నిలిపివేయబడును. ఆయా గ్రామాల గృహ, వాణిజ్య, వ్యవసాయ , పరిశ్రమల వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని మిర్యాలగూడ రూరల్ ఎఈ అమర్ సింగ్ కోరారు.

MOST READ : 

  1. Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

  2. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

  5. Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

మరిన్ని వార్తలు