Breaking Newsతెలంగాణహైదరాబాద్

Breaking News : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

Breaking News : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో జరిగిన వివిధ కార్యక్రమాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, తెలుగు రాష్ట్రాల వార్తలు అందిస్తున్న మన సాక్షి టాప్ 5 బ్రేకింగ్ న్యూస్

తెలంగాణలో హైకోర్టు భవన నిర్మాణం : 

రూ.2583 కోట్లతో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణం. 100 ఎకరాల్లో 10 బ్లాకులతో నూతన భవనం. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం .ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం.

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం :

జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌ పై దాడి చేసిన పోలీసులు. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు, ఒకరికి పాజిటివ్. డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు.

డిల్లీలో భూకంపం : 

ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు.

ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు..!

20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టు సమాచారం. అదే రోజు ముఖ్యమంత్రితో పాటు కొలువుదీరనున్న మంత్రివర్గం. పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు దక్కనున్నట్టు అనధికారిక సమాచారం.

కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

  4. Kabaddi : ముగిసిన తెలుగు రాష్ట్రాల మహిళ కబడ్డీ పోటీలు.. విజేతలకు బహుమతులు అందజేత..!

మరిన్ని వార్తలు