Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Kabaddi : ముగిసిన తెలుగు రాష్ట్రాల మహిళ కబడ్డీ పోటీలు.. విజేతలకు బహుమతులు అందజేత..!

Kabaddi : ముగిసిన తెలుగు రాష్ట్రాల మహిళ కబడ్డీ పోటీలు.. విజేతలకు బహుమతులు అందజేత..!

పెన్ పహాడ్, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య జాతర ఐదో రోజు జరిగినది. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవతామూర్తులను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా చిన్న సీతారాం తండా చెట్ల ముకుందాపురం గ్రామాల్లో దేవతామూర్తుల విగ్రహాలకు ట్రాక్టర్లు ఊరేగింపు నిర్వహించినారు.

రాత్రి దేవాలయం వద్ద డాన్స్ బేబీ డాన్స్ జబర్దస్త్ టీం కార్యక్రమం నిర్వహించినారు. రెండు రాష్ట్రాల మహిళా కబడ్డీ పోటీలలో ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో ప్రధమ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ జట్టు, ద్వితీయ బహుమతి నల్లగొండ , తృతీయ బహుమతి చతుర్ధ బహుమతి ఖమ్మం ,సూర్యాపేట, పంచమ బహుమతి హైదరాబాద్, కార్పోరేషన్ బహుమతి వరంగల్ జెట్లు గెలుచుకున్నాయి.

గెలుపొందిన విజయ్తలకు దేవాలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజీవ్ గాంధీ, కీర్తి వెంకట్రావు గౌడ్, నల్లబోలు లింగారెడ్డి ,వెన్న గోపిరెడ్డి, కీర్తి ఎలమంచయ్య, దేశ గాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

౹ లేటెస్ట్ :

  1. Holiday : నేడు ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..!

  2. Suryapet : అర్థరాత్రి కేసారం నుండి పెద్దగట్టుకు చేరిన దేవర పెట్టె..!

  3. Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు