Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

బిగ్ బ్రేకింగ్ : TSPSC గ్రూప్ 2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

బిగ్ బ్రేకింగ్ : TSPSC గ్రూప్ 2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణలో ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన TSPSC గ్రూప్ 2 పరీక్ష ప్రభుత్వం వాయిదా వేసింది. గ్రూప్ పరీక్షను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. డీఎస్సి, గ్రూప్ టు పరీక్షలు వాయిదా వేయాలని ఈ ఆందోళన కొనసాగుతుంది. కానీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

డీఎస్సీ కారణంగా గ్రూప్-టును వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వచ్చింది. దాంతో ప్రభుత్వం గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్ లో టి ఎస్పిఎస్సి 783 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే వివిధ కారణాలవల్ల మూడుసార్లు గ్రూపుకు పరీక్ష వాయిదా పడింది.

కాగా ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 7, 8 తేదీలను పరీక్ష నిర్వహించనున్నట్లు మొదట తెలియజేసింది. కానీ వాయిదా వేయాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో తిరిగి డిసెంబర్ కు పరీక్ష వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి : 

BREAKING : PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

Pds Rice : 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం.. 11 కేసులు..!

మరిన్ని వార్తలు