క్రైంBreaking Newsతెలంగాణవిద్యహైదరాబాద్

Hyderabad : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం..!

Hyderabad : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఏడేళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాస్టికంకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో ట్యూషన్ టీచర్ కాల్చారు. ఓయూ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు తేజ నందన్ ఒకటవ తరగతి చదువుతున్నాడు.

చదవడం లేదనే కారణంతో ట్యూషన్ టీచర్.. బాలుడి
చేతులు , కాళ్లు, మొఖంపై వాతలు పెట్టారు. అట్లకాడతో తేజ నందన్ శరీరం పైన 8 చోట్ల ట్యూషన్ టీచర్ శ్రీ మానస అట్లకాడతో కాల్చారు. కాగా బాలుడి తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కొడుకును విచక్షణ రహితంగా అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్ మానస పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

MOST VIEWS 

  1. BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

  2. TG News : మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు.. ఈసారి కేటీఆర్ పైన..!

  3. Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!

  4. CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

మరిన్ని వార్తలు