Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Tunnels in Hyderabad : హైదరాబాద్ లో భూగర్భ రోడ్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు..!

Tunnels in Hyderabad : హైదరాబాద్ లో భూగర్భ రోడ్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ లో భూగర్భ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాదులో పాదచారులు నడిచేందుకు ప్రత్యేకంగా ఫూటోవర్ బ్రిడ్జిలు, వాహనదారులు వెళ్లేందుకు ఫ్లైఓవర్ లు, భూగర్భ రడ్లు ఉన్న విషయం తెలిసిందే.

అయినా కూడా హైదరాబాదులో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. మరికొన్నిచోట్ల భూగర్భ రోడ్లు నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులో కొత్తగా ఐదు టన్నుల్స్ నిర్మించనున్నారు. వీటిని నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాలపై డిపిఆర్ కోసం టెండర్లను కూడా పిలిచింది .

థర్మల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించి ఈ సొరంగాలను ఐదు ముఖ్యమైన కారిడార్లలో నిర్మించబోతున్నారు. వీటివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ అంతటికి కనెక్టివిటీ మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఐటిసి కోహినూర్ – విప్రో సర్కిల్ వయా కాజాగూడ, నానక్రామ్ గూడ వరకు, ఐటిసి కోహినూర్ – జేఎన్టీయూ, మైండ్ స్పేస్ వరకు మరొక టన్నెల్, ఐటిసి కోహినూర్ – బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు, జీవీకే వన్ మాల్, నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్ వరకు, నాంపల్లి – చంద్రాయన గుట్ట , ఐ ఆర్ ఆర్ వయా చార్మినార్, ఫలక్ నుమా వరకు మరో పల్లెలో ప్రతిపాదించారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అండర్ పాస్, ఫ్లైఓవర్ టన్నెలను నిర్మించి మహానగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. వాటికి అనుగుణంగా మహానగరంలో మొదటగా టన్నెలను నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కీలకమైన ప్రాంతాలలో టన్నెల్ ను నిర్మిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది.

MOST READ :

మరిన్ని వార్తలు