Medaram Sammakka Sarakka Jathara : మేడారం వెళ్లే భక్తులు.. ఆ తల్లిని ముందే దర్శించుకుంటున్న భక్తులు..!

మేడారం జాతర ప్రారంభమైంది. గద్దె పైన సమ్మక్క ,సారక్క కొలువు తీరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Medaram Sammakka Sarakka Jathara : మేడారం వెళ్లే భక్తులు.. ఆ తల్లిని ముందే దర్శించుకుంటున్న భక్తులు..!

ములుగు , మన సాక్షి :

మేడారం జాతర ప్రారంభమైంది. గద్దె పైన సమ్మక్క ,సారక్క కొలువు తీరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మేడారం జన జాతర సాగుతోంది. మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు.

ముందుగా ఘట్టమొతల్లిని దర్శించుకోవాలని భక్తులు రావడంతో ములుగు శివారులో ఉన్న గట్టమ్మ తల్లి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గట్టమ్మ తల్లి దేవాలయం వద్దకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. జాతరకు వెళ్లే భక్తులు ములుగు శివారులోని గట్టమ్మ తల్లి ని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.