Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతుల్లో అసంతృప్తి తొలగేలా వానాకాలం రైతు భరోసాకు.. డేట్ ఫిక్స్..!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా వారి వారి ఖాతాలలో వేసే విషయంపై నిర్ణయం తీసుకుంది.

Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతుల్లో అసంతృప్తి తొలగేలా వానాకాలం రైతు భరోసాకు.. డేట్ ఫిక్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా వారి వారి ఖాతాలలో వేసే విషయంపై నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ లో పలు విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 26వ తేదీన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వేసే విధంగా చర్చించనున్నట్లు తెలిసింది.
ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలపై చర్చించనున్నారు. ఈనెల 26వ తేదీన గాని లేదా నెలాఖరులో గాని రైతుల ఖాతాలలో 9000 కోట్ల రూపాయలను జమ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
జూన్ మాసంలోనే వానాకాలం రైతు భరోసా అందజేసేందుకు బహిరంగ సభను నిర్వహించి నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నారు.
యాసంగి సీజన్ రైతు భరోసా తో అసంతృప్తి :
యాసంగి సీజన్ లో రైతు భరోసా కేవలం 5653 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. రైతులకు రైతు భరోసా దశల వారీగా సాగు గడువు ముగిసినాఓ.. ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొన్నది. రెండు విడతలుగా రైతు భరోసా అందజేసినప్పటికీ కూడా కేవలం రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేశారు. మిగతా రైతుల్లో అసంతృప్తి నెలకొన్నది. ఇదిలా ఉండగా వానకాలం సీజన్ లో రైతుల నుంచి వస్తున్న అసంతృప్తిని తొలగించుకునే విధంగా వానాకాలంలో ఒకేసారి రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకుగాను నిధుల సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- Paddy : ఆ ఎనిమిది రకాల వరి వంగడాలకే డిమాండ్.. రైతులు వాటినే సాగు చేయాలి..!
- గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బీఐఎస్-ఈఆర్ సర్టిఫైడ్ స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఆవిష్కరణ!
- Miryalaguda : రైస్ మిల్లర్ల సంచలన ప్రకటన.. ముందే చెప్తున్నాం, ఆ ధాన్యం కొనుగోలు చేయం..!
- Water : ప్రతిరోజు ఉదయం పరిగడుపున నీళ్లు తాగవచ్చునా.. ఆరోగ్యమేనా.. తెలుసుకుందాం..!









