Suryapet : సూర్యాపేటలో నాబార్డు జిల్లా కార్యాలయం ప్రారంభం..!
సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి మరింత వేగవంతం చేసేందుకు నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని నాబార్డ్ తెలంగాణ సిజిఎం ఉదయ భాస్కర్ మంగళవారం ప్రారంభించారు.

Suryapet : సూర్యాపేటలో నాబార్డు జిల్లా కార్యాలయం ప్రారంభం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి మరింత వేగవంతం చేసేందుకు నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని నాబార్డ్ తెలంగాణ సిజిఎం ఉదయ భాస్కర్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతలో నల్గొండ క్లస్టర్ కింద ఉన్న సూర్యపేటను ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మార్చి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను సూర్యాపేట జిల్లా నాబార్డ్ ప్రతినిధిగా డి రవీందర్ నాయక్ ను నియమించినట్టు చెప్పారు.
జిల్లాలోని రైతులు మహిళలు సంఘాలు అభ్యున్నతికి నాబార్డు నిరంతరం కృషి చేస్తుందన్నారు. సూర్యాపేటలో ఫిషరీస్ ,ఎనిమల్ హస్బెండరీ, డైరీ రంగాలలో మూడు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నాము అని తెలిపారు. మహిళా సంఘాల జీవనోపాదుల కల్పనకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు . కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వేరుశనగ సాగు వంటి వివిధ వ్యవసాయ రంగంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా సాగు పద్ధతులు ప్రోత్సహిస్తూ డిసిసిబి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారంతో రైతులకు ఎఫ్పిఓల కు సకాలంలో కేసీసీ, గృహ, వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని సి.జి.ఎమ్ తెలియజేశారు. అనంతరం మున్యా నాయక్ తండా లో ఎల్ ఈ డి పి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ ప్రతినిధులు బి. ఉదయ్ భాస్కర్, బి. స్వాతి, డి. రవీందర్ నాయక్, ఎల్. డి.ఎం నాగప్రసాద్ డిసిసిబి సిఈఓ శంకర్రావు, టి.జి.బి చీఫ్ మేనేజర్ అజయ్, కె వి కె సీనియర్ సైంటిస్ట్ నరేష్, ఎన్జీవో ప్రతినిధులు వి రమేష్ ఇన్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.









